ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో సోదాలకు దిగింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా ఈ దాడులు నిర్వహిస్తోంది. ఈ ముఠాలు కెనడా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఎన్ఐఏకి సమాచారం అందింది.