మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విడుదల విషయమై పశ్చిమబెంగాల్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉపాధిహామీ పథకంతో పాటు గ్రామీణ్ ఆవాస్ యోజనకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.15 వేల కోట్లు ప్రభుత్వం నిలిపివేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బకాయిల విడుదల కోసం ఢీల్లీలో భారీ నిరసనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 50 లక్షల లేఖలను కేంద్ర మంత్రికి పంపనున్నట్లు తాజాగా తెలిపింది.