ప్రభుత్వం నాణ్యమైన పోర్టి ఫైడ్ రైసును పేదలకు చెరువ చేస్తుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రైస్‌లో ఐరన్ పోలీక్ ఆమ్లం, విటమిన్ B12 ఉన్నాయన్నారు. ఇది ప్లాస్టిక్ రైస్ అని కొంతమంది విషయ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే సాటెక్స్ బియ్యం పేదలకు చేరువ చేసేందుకు 300 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ రైస్‌ను కడిగినా, ఉడికించినా, గంజి వారపెట్టినా పోషకాలు పోవన్నారు. ప్లాస్టిక్ రైస్ అని ట్రోల్ చేస్తున్న వారికి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 26 జిల్లాలలో రెండు లక్షల 9 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.