ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. బుధవారం శాసన మండలిలో మంత్రి రజినీ మాట్లాడుతూ......ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. 105 రకాల మందులు 14 రకాల టెస్టులు చేస్తున్నారు.పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఒక డాక్టర్ విధులు నిర్వహిస్తూ మరొక డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో పాల్గొంటున్నారు.జీరో వేకెన్సీ విధానాన్ని సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చారు.రాష్ట్రంలో 53 వేల 190 మంది మెడికల్ స్టాఫ్‌ను రిక్రూట్మెంట్ చేశాము.పేదవారికి ఆరోగ్య సమస్యలు వస్తే గతంలో వైద్యం అందని పరిస్థితి ఉండేది, టెస్టులో పరికరాలు కొరతగా ఉండేవి.సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గ్రామస్థాయిలోనే వైద్య సేవలను మెరుగుపరిచారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా రెండు కోట్ల 30 లక్షల మంది ఈ సేవలనువినియోగించుకున్నారు.సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు.8500 కోట్లతో ఈ కళాశాలలో ఏర్పడనున్నాయి.ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండా లన్నది సీఎం ఆకాంక్ష.ఈ విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి.150 మెడికల్ సీట్లతో ఐదు మెడికల్ కాలేజీలలో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.రానున్న విద్యాసంవత్సరాల్లో మరిన్ని మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి.భారత దేశ చరిత్రలోనే నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటుతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు అని అన్నారు.