చంద్రబాబుతో పాటు దోపిడీలో భాగస్వాములైన వారు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ అంటూ వెళ్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. 'చంద్రబాబు గారు, ఆయన కుమారుడి దోపిడీలో భాగస్వాములైన మాజీ మంత్రులు, మాజీ అధికారులు, బినామీల ముందస్తు బెయిళ్లు, స్క్వాష్ పిటిషన్లతో ఏసీబీ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వరకు కోర్టుల సమయాన్ని హరిస్తున్నారు. మీరు నిజంగా నిర్దోషులైతే దర్యాప్తును ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటపడొచ్చు కదా?' అని ట్వీట్లో విజయసాయి ప్రశ్నించారు.