ఏపీలోనే మొదటిసారిగా విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు జనవరి 15న ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. ఫస్ట్ ఫేస్ లో భాగంగా రూ.9,699 కోట్ల వ్యయంతో 76 కి.మీ లైట్ మెట్రో నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటగా 42 స్టేషన్లతో 3 కారిడార్లను ఏర్పాటు చేయనుంది. నిధుల సమీకరణ వేగవంతం చేయాలని మెట్రో రైల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా పిల్లర్ల నిర్మాణం ఉంటుంది.