ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు.