టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మైదుకూరు ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అనుబంధ విభాగం బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దీక్ష శిబిరాన్నీ నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు సంజీవ రెడ్డి పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.