బీహార్‌లోని బంకా జిల్లాలో సీఎం నితీశ్‌కుమార్ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌ను నితీశ్ సందర్శించారు. అక్కడున్న గ్రంథాలయంపై ‘డిజిటల్ లైబ్రరీ’ అని ఇంగ్లీష్‌లో రాసున్న బోర్డు ఆయన కంటపడింది. దీంతో బోర్డు హిందీలో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. ‘‘మనం బ్రిటీష్ కాలంలో జీవించడం లేదు కదా’’.. అని జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ కుమార్‌పై ఫైరయ్యారు.