టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సొంతపార్టీ నేతలే సైలెంట్‌గా ఉంటే.. తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేల హడావిడి ఎక్కువైందని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. చంద్రబాబుకు 23 లక్కీ నెంబర్ అని, తమ పార్టీకి చెందిన 23 మందిని లాక్కున్నారని, 2014లో ఆయనకు వచ్చిన సీట్లు 23 అని చెప్పారు. చంద్రబాబును పక్కా ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు.