ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డించే ‘మిడ్ డే మీల్స్’లో అవకతవకలకు పాల్పడుతున్న హెడ్‌మాస్టర్లపై డీఈవో రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శించిన జిల్లాలోని 486 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ‘మిడ్ డే మిల్స్’లో ప్రతిరోజు ఏదో ఒక వెరైటీతో పాటు పల్లి చెక్కి, కోడిగుడ్డు, అరటిపండును తప్పనిసరిగా విద్యార్థులకు అందించాలని ఆయన సూచించారు.