స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 2వేల పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 27తో ముగియాల్సి ఉండగా.. అక్టోబరు 3 వరకు పొడిగించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.