ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని టీడీపీ నేత లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ సర్వే నివేదిక ప్రకారం 2021-22 వార్షిక సంవత్సరంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఏపీలో 12.6 శాతంగా ఉందని.. ఇది దేశంలో రెండవ స్థానమని చెప్పారు. అదేవిధంగా 1,33,447 మంది మహిళలు వ్యభిచారకూపంలోకి నెట్టబడుతున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్న సీఎం జగన్ ఏమీ పట్టనట్లు ఉంటున్నారని మండిపడ్డారు.