రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు లో గురువారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా 14 ఆర్వో ప్లాంట్లు, ఆరు వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, 6 ఆర్బీకేలు, నాలుగు గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. రూ. 1. 2 కోట్ల విలువైన వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.