పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం పరిస్థితులపై మాట్లాడారు. యానానికి నష్టంవాటిల్లే పేకాట క్లబ్‌లు మూసేవరకు, అధ్వానంగా ఉన్న పారిశుధ్యాన్ని దారిపెట్టేవరకు తాను పోరాటం ఆగదని, తాను ఈవిషయంలో ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని మల్లాడి తెలిపారు. క్లబ్బులో ముడుపులు పంచుకోవడంలో ఏర్పడిన వివాదంతో కొందరు సభ్యులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వడంతో క్లబ్ మూతబడింది. మళ్లీ అనుమతులకు ముడుపులు ఇచ్చినట్టు సమాచారం రావడంతో ప్రజలు, స్థానిక నాయకులతో కలిసివచ్చి పరిపాలనాధికారిమునిస్వామి, మున్సిపల్ కమిషనర్ ఆరుల్ ప్రకాశంలకు మల్లాడి వినతిపత్రాని అందజేశారు. ఎట్టిపరిస్థితుల్లో మున్సిపాల్టీ అనుమతి ఇవ్వకూడదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీటిపై చర్యలు తీసుకోకపోతే ప్రజాపోరాటం చేస్తానని మల్లాడి హెచ్చరించారు. ఈవినతిపత్రాలను గవర్నర్, సీఎం, ఉన్నతాధికారులకు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు, వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, సుంకర కార్తిక్ పాల్గొన్నారు.