రాజకీయ కక్షతోనే చంద్రబాబును జగన్‌రెడ్డి జైలు పాలు చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ....ఏ తప్పూ చేయని చంద్రబాబును అభూత కల్పనలతో అరెస్ట్ చేశారు. తర్వాత సాక్ష్యాల కోసం సీఐడీ పరుగులు పెడుతోంది. సుప్రీంకోర్టులో పిటిషిన్ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వ్యవహరించిన తీరు చంద్రబాబుపై సీఎం ఎంత కక్ష కట్టారో అర్థమయింది. ఏ సాక్ష్యాధారాలు లేకపోయినా, ముఖ్యమంత్రి కక్ష కట్టి, జైలుకు పంపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచడం జగన్‌రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపులో భాగమేనని వర్ల అన్నారు.