ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఆగిరిపల్లి మండల పరిధిలోని ఈదర గ్రామంలో ఈ నెల 24వ తేదీ రాత్రి గురజాల సంగీతరావు అనే వ్యక్తిని కత్తితో పొడిచిన నిందితులు దేవరపల్లి రమేష్ అలియాస్ మోషె, దేవరపల్లి నవీన్‌లను బుధవారం ఆగిరిపల్లి ఎస్సై ఎన్.చంటిబాబు అరెస్టు చేశారు. 4 వేల రూపాయల బాకీ విషయమై తగవు పడి నిందితులు సంగీతరావును పొట్టలో పొడిచిన సంగతి విదితమే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను గాలించి బుధవారం అరెస్టు చేసి నూజివీడు కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. సత్వరం నిందితులను అరెస్టు చేయడంతోపాటు సకాలంలో స్పందించి బాధితుడి ప్రాణాలను కాపాడిన ఆగిరిపల్లి పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.