ఇండియాలో 2023లో 10 లక్షల నాన్ ఇమిగ్రంట్ వీసాలను జారీ చేయాలన్న లక్ష్యాన్ని అధిగమించినట్లు అమెరికా ఎంబసీ తెలిపింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో తమ కుమారుడి స్నాతకోత్సవానికి హాజరవుతున్న పునీత్ దర్గన్, డాక్టర్ రంజుసింగ్ దంపతులకు 10 లక్షల వీసాను గురువారం భారత్లో తమ రాయబారి గార్సెట్టి అందజేశారని వెల్లడించింది. ఇదే ఒరవడిని ఇకపైనా కొనసాగిస్తామని ప్రకటించింది.