ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో ఆగ్రహానికి గురైన తల్లి తన కొడుకుతో కలిసి ఆ యువతి పెట్రోల్ పోసి నిప్పంటించారు. హాపూర్ జిల్లా నవాడ్ ఖుర్డ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో 70 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోందని స్థానిక పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన యువతి తల్లి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.