చెన్నైకి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజ్ కుమార్ ఖాతాలో పొరపాటున రూ.9000 కోట్లు జమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఎండీ, సీఈవో కృష్ణన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. దీంతో బ్యాంక్ బోర్డు కృష్ణన్ రాజీనామాను ఆమోదించింది. ఆర్ బీఐ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆయన పదవిలో కొనసాగుతారని బ్యాంక్ బోర్డు స్పష్టం చేసింది.