అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీకి బయలు దేరారు. విచారణకు రావాల్సిందిగా 41 ఏ కింద నోటీసులు ఇవ్వనున్నారు. మరోవైపు ఇదే కేసులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్పోస్ చేసింది. విచారణకు సహకరించాలని సూచించింది. దీంతో స్వయంగా నోటీసులు ఇచ్చేందుకు సిఐడి బృందం ఢిల్లీకి వెళ్లింది.