వాహనమిత్రతో ఇచ్చేది రూ.10 వేలు కొట్టేస్తున్నది రూ.లక్ష అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షలు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాల పేరుతో జగన్ రెడ్డి నవమోసాలు చేశారన్నారు. చంద్రబాబు సంక్షేమానికి ఏటా బడ్జెట్లో 18.21% ఖర్చు చేస్తే జగన్ పాలనలో సంక్షేమానికి ఖర్చు 16.20% మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పెరిగినా సంక్షేమం బడ్జెట్ ఎందుకు తగ్గుతోందని నిలదీశారు.