ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్‌కు భారీ ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 03:28 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ హైకోర్టులో శుక్రవారం భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్టోబర్ 4 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. మరో వైపు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను సైతం బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com