రైల్వేశాఖ చేపట్టిన డబల్ లైన్లో ఏర్పాటుతో రోజు వచ్చే రైలు రాకపోకలు వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ ఎస్ ఎం ఆర్ సతీష్ రెడ్డి తెలిపారు. రైలు రాకపోకల సమయాలు అక్టోబర్ 1 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, ప్రయాణికులు మార్పులను గమనించాలని కోరారు. డబుల్ లైన్ వేయడంతో రైలు 5 నుంచి 15 నిమిషాల ముందుగా శాంతి నిలయం స్టేషన్ కు చేరుకుంటుందని తెలిపారు.