ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ అవసరాల కోసం కుల, నివాస, జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లను ఒకసారి తీసుకుంటే చాలని, వీటినే శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని స్పష్టం చేసింది. వీటిని కోల్పోతే పాత సర్టిఫికెట్ నంబర్ సాయంతో కొత్తవి తీసుకోవచ్చని తెలిపింది. ప్రతిసారీ కొత్త సర్టిఫికెట్ల కోసం ఒత్తిడి తేవొద్దని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.