ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం నుంచి 'జగనన్న ఆరోగ్య సురక్ష' హెల్త్ క్యాంపులు ప్రారంభమవుతాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 10,032 విలేజ్ క్లినిక్స్, 542 పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు 45 రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్లు పరిష్కరిస్తారని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారని వివరించారు.