పట్టణాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇళ్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకం తీసుకురానుంది. దీని ద్వారా చౌకగా గృహ రుణాలు అందించనుంది. తక్కువ వడ్డీలకు రుణాలు అందిస్తామని, వడ్డీ రాయితీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేయడానికి సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.