ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రబాబుని అరెస్ట్ చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు విమర్శించారు. 20 రోజుల్లో జగన్ బృందం ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయిందన్నారు. అధికారం అండతో రాజ్యాంగాన్ని బ్రష్టుపట్టించి వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారన్నారు. ప్రశ్నించే వారిపై అవినీతి బురద రాసేస్తున్నారన్నారు. బొత్స వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని కళా వెంకట్రావు అన్నారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం చూపించగలరా..? అని నిలదీశారు.