ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఎస్. నారాయణ రెడ్డి కుమారుడు, వైసిపి సీనియర్ నాయకులు ఎస్. రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సోమందేపల్లిలోని తన స్వగృహం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు