టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుపై సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ స్పందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... నేను అమెరికా దాటి ఎక్కడా ఆఫీసు పెట్టలేదు. ఒకవేళ ఇండియాకి వస్తే మొదటిసారి మీ దగ్గరికి వచ్చి ఆఫీసు పెడతాను అని ఆనాడు చంద్రబాబుతో బిల్ గేట్స్ అన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రాగానే ఒకరి తర్వాత ఒకరు అందరూ లైన్ కట్టి హైదరాబాద్ వచ్చారని అన్నారు. బిల్ గేట్స్‌ని హైదరాబాద్ హైటెక్ సిటీ ఓపెనింగ్‌కి చంద్రబాబు ఆహ్వానించారని గుర్తుచేశారు. 2000 సంవత్సరంలోనే విజన్ 20-20 అని ప్రారంభించిన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని గుర్తుచేశారు.