నారా భువనేశ్వరి తన తండ్రి, భర్త సీఎంలుగా పనిచేసినా ఏ రోజూ రాజకీయలు, పాలన గురించి పట్టించుకోలేదని టీడీపీ నేత బీద రవిచంద్ర అన్నారు. సత్యమేవ జయతే దీక్ష కార్యక్రమంలో భాగంగా అయన మాట్లాడుతూ... నిండు సభలో భువనేశ్వరిని దుర్మార్గంగా, నీచంగా అవమానించారన్నారు. ఇవాళ ప్రజల కోసం ఓ తల్లిలా, అక్కలా, చెల్లెలిలా పోరాడుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను ఎందుకు ఓడించాలి? చంద్రబాబుని ఎందుకు గెలిపించాలి? అని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.