నేడు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ... రాష్ట్రంలో 5 లక్షల మంది కార్మికులుంటే 80వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం పథకం అందిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పావలా వడ్డీ రుణాలను చెల్లించటం లేదన్నారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయటం లేదని విమర్శించారు. జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రశ్నించారు. మద్యంలో వాటాలు తీసుకుంటు ప్రజారోగ్యం పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీజి కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏమైందని నిలదీశారు. గ్రామ పంచాయతీలను కాదని సచివాలయ వ్యవస్థ తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచారన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా పంచాయతీలకు ఇవ్వకుండా కాజేశారని ఆరోపించారు.