టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు సీఐడీ నోటీసులు జారీచేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ఉన్నారు. అక్టోబర్-4న విచారణకు రావాలని సీఐడీ సూచించింది. నారా లోకేష్‌తో కలిసే విచారణకు రావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. వాట్సాప్ ద్వారా ఈ నోటీసులను నారాయణకు సీఐడీ అధికారులు పంపారు. నారాయణకు నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఎల్లుండి నారాయణ, లోకేష్‌లను కలిపి విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ఇన్నర్ రింగురోడ్డు కేసులో చంద్రబాబును ఏ-01గా చేర్చింది సీఐడీ. మరి.. సీఐడీ విచారణకు నారాయణ వెళ్తారో.. లేదో..? అక్టోబర్-4న ఏం జరుగుతుందో చూడాలి.