చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మంగళగిరిలో సత్యమేవ జయతే పేరుతో చేపట్టిన నిరాహార దీక్షలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు పలువురు న్యాయవాదులు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. అటు గుంటూరు జిల్లా పలువురు నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. కొల్లిపరలో మాజీ మంత్రి ఆలపాటి రాజా దంపతులు నిరహార దీక్షకు దిగగా .. మూల్పూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ నసీర్ నిరహార దీక్షకు కూర్చున్నారు.