నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... మన దేశంలోనే కాదు. ప్రపంచంలోనే కమ్యుూనిస్టు పార్టీలను కొనే మొనగాడు ఇప్పటి వరకు పుట్టలేదు. ఇకపై పుట్టబోడు. కమ్యుూనిస్టు పార్టీల చరిత్ర మీకు తెలుసా?, ప్రపంచంలోని అనేక దేశాల్లో సామాజిక, ప్రజా ఉద్యమాలకు, అణగారిన వర్గాల హక్కులు, మతసామరస్యం, స్వాతంత్రం కోసం కమ్యుూనిస్టు పార్టీలు చేసిన పోరాటాలను తెలుసుకోండి. కమ్యుూనిస్టు పార్టీలను విధానపరంగా విమర్శలు చేయొచ్చు. ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండించి పోరాటాల్లో పాల్గొంటే తప్పేంటి?, ఈ సజ్జల వెంటనే కమ్యుూనిస్టులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి.’’ అని డిమాండ్ చేశారు.