టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌కు నిరసగా హైదరాబాద్ ఎన్టీఆర్భవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు కించపరిచినప్పుడు మహిళా కమిషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు గాజులు తొడుక్కుని కూర్చున్నారని విమర్శించారు. భువనేశ్వరి, బ్రహ్మణి, లోకేశ్‌లకు ఎన్టీఆర్ ఫ్యామిలీ అండగా ఉంటోందని తెలిపారు.