టీడీపీ కార్యాలయం వద్ద సత్యమేవ జయతే దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... గాంధీ జయంతిని ఇంటర్నేషనల్ నాన్ వయోలెన్స్ డేగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసుని నిరసిస్తూ శాంతియుతంగా దీక్ష చేపట్టామన్నారు. ఏపీలో అరాచకపాలన సాగిస్తున్న సైకో నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందని నారాయణ చెప్పుకొచ్చారు.