విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలోని తూముల సింహాచలం అనే కళాకారుడి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 31న హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. కాగా.. ప్రజాకళా బృందాలలో పని చేశానన్నందుకే తన ఇంటిలో సోదాలు చేశారని సింహాచలం పేర్కొన్నారు. కళాకారూపాలకు చెందిన ఓ కరపత్రం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారని కళాకారుడు సింహాచలం వెల్లడించారు.