టీడీపీ అధినేత చంద్రబాబుపై అవినీతి మరక వేసి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. సత్యమేవ జయతే దీక్షా శిబిరంలో అనిత మాట్లాడుతూ.... ‘‘చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అవినీతి మరక వేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి న్యాయం కోసం దీక్ష చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని జైలులో పెట్టారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు. రెండు లక్షల అవినీతికి పాల్పడిన జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. చంద్రబాబు కుటుంబానికి అండగా ఉంటాం.’’ అని ఆమె తెలిపారు.