చంద్రబాబు అరెస్టుకి నిరసనగా బాపట్ల జిల్లా, అమృతలూరు మండలం మూల్పూరులో నక్కా ఆనంద బాబు నిరహార దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో తటస్థ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ..... ప్రస్తుతం సైకో రెడ్డి పిచ్చోడిగా మారారు. పిచ్చోడు పాలనకు పనికిరారు. తన అవినీతి అంశం పక్కదారి పట్టించేందుకే అక్రమ అరెస్ట్లు. రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడిని వెలుగులోకి తెచ్చాం. ఇసుక దోపిడీ కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అక్రమ అరెస్ట్. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సత్యగ్రహా దీక్షలు చేస్తున్నాం. దీక్షలను పక్కదారి పట్టించేందుకే బండారు సత్యనారాయణ అరెస్టు హడావుడి. మాజీ మంత్రి నారాయణకు నోటీసులు అంశం కూడా సైకో రెడ్డి చీప్ ట్రిక్స్. జనసేన కలయికతో తాడేపల్లి కూసాలు కదులుతున్నాయి. పిచ్చోడిని రాళ్లతో తరిమి తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’’ అని ఆయన పేర్కొన్నారు.