స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు. అంతకుముందే ఢిల్లీలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు సత్యగ్రహ దీక్షలో కూర్చుకున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.