తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి మూసివేయబడుతుంది.. అక్టోబర్ 29న తిరిగి తెరవబడుతుంది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం గంటలకు పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు. అక్టోబర్ 2న ఎస్ ఎస్ డి టోకెన్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. పెరటాసి నెల రద్దీ కారణంగా అక్టోబర్ 2వ తేదీన ఎస్ ఎస్ డి టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తీర్థయాత్రను రూపొందించుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.
తిరుమలలో అక్టోబర్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
అక్టోబర్ 1: బృహత్యుమావ్రతం (ఉండ్రాళ్ల తద్దె)
అక్టోబర్ 3: మధ్యాష్టమి
అక్టోబర్ 10: మాతత్రయ ఏకాదశి
అక్టోబర్ 13: మాస శివరాత్రి
అక్టోబర్ 14: మహాలయ అమావాస్య, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వేదాంత దేశిక ఉత్సవం ప్రారంభం
అక్టోబర్ 15: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అక్టోబర్ 19: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ
అక్టోబర్ 20: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పుష్పక విమానం, సరస్వతి పూజ
అక్టోబర్ 21: దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం
అక్టోబర్ 22: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి
అక్టోబర్ 23: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానం, మహర్నవమి, విజయ దశమి,
వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం
అక్టోబర్ 24: పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం
అక్టోబర్ 25: మాతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం
అక్టోబర్ 28: పాక్షిక చంద్ర గ్రహణం
అక్టోబర్ 31: చంద్రోదయోమ వ్రతం (అట్ల తద్దె)