కావేరీ నదీ జలాల పంపిణీపై వివాదం కొనసాగుతుండగా, రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలనే సంకల్పం కర్ణాటక ప్రభుత్వానికి లేదని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై సోమవారం అన్నారు. కావేరీ జలాల నియంత్రణ కమిటీ ముందు కర్ణాటక వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీయలేదని బొమ్మై అన్నారు.కావేరీ జలాల పంపకంపై కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజుకుంది. రెండు రాష్ట్రాల ప్రజలకు ఈ నది ప్రధాన జీవనాధారం.సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 15, 2023 వరకు బిలిగుండ్లు వద్ద 3000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ కర్ణాటకను ఆదేశించింది.