మలేరియాకు సంబంధించిన వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేసింది. ఈ మూడు డోసుల వ్యాక్సిన్ 75 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు వెల్లడించారు. 2001లో వచ్చిన GSK టీకా కంటే ఇది మరింత సమర్థవంతమైనదని WHO చీఫ్ టెడ్రోస్ అథనామ్ వెల్లడించారు.