ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎలక్ట్రానిక్ సిగరెట్లను (ఈ-సిగరెట్లు) సెప్టెంబర్ 2019లో భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం కొనసాగుతోందని విమానయాన శాఖకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా పంపిన ఓ వివరణలో పేర్కొంది. ఈ-సిగరెట్ల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతి, రవాణా, విక్రయాలు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ-సిగరెట్లు, వాటి పరికరాలను కలిగి ఉంటే నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది.