సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల హై స్కూల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. దసరా నుంచి ఈ స్కీం ప్రారంభిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో ఎన్నికల కోడ్ రానుండడంతో అధికారికంగా 6న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.