మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత 48 గంటల్లో ఏకంగా 31 మంది ఈ ఆసుపత్రిలో చనిపోయారు. మృతుల్లో 16 మంది చిన్నారులే ఉన్నారు. ఇక నిన్న 24 మంది చనిపోగా, మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉండడం అందరినీ కలచి వేస్తోంది. ఆ సంఖ్య ప్రస్తుతం మరింత పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై తనకు సమాచారం లేదని సీఎం ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానించారు.