రోడ్ల వెంబడి వాహనాలు, ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మీడియా డివైజ్ డిస్ ప్లే బోర్డుల తొలగింపు రెండో రోజు కొనసాగిందని కమిషనర్ కీర్తి తెలిపారు. రహదారి భ్రదతా కమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు సోమవారం నగరంలో, రోడ్ల వెంబడి ప్రకటనల బోర్డులను పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు తొలగించారన్నారు. పొన్నూరు రోడ్డు, గడ్డిపాడు చెరువు, మంగళగిరి రోడ్డు, కలెక్టరు బంగ్లా రోడ్డులలో బోర్డులను తొలగించామన్నారు.