ఖరీదైన మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికి గుంటూరు ఐటీ కోర్ సైబర్ క్రైం పోలీసులు ఫోన్ ను తిరిగి అప్పగించారు. రఘురామిరెడ్డి అనే వ్యక్తి ఖరీదైన సెల్ఫోన్ ఇటీవల పోగొట్టుకున్నారు. దీంతో అతను సీఈఐఆర్ ఫోర్టల్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ కోర్ నోడల్ అధికారిణి సుప్రజా ఆధ్వర్యాన దర్యాప్తు చేపట్టారు. ఐఎంఈఐ ద్వారా హైదరాబాద్ లో మొబైల్ ఫోన్ ఉన్నట్లు గుర్తించి, దాన్ని అక్కడ నుంచి తెప్పించి భాదితుడికి అందజేశారు.