అమరావతి వచ్చే భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం గుంటూరు నుంచి అమరావతి అమరేశ్వరస్వామి గుడి వరకు, ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించినట్లు గుంటూరు-1 డిపో మేనేజర్ రామకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతి గుడివద్ద నుంచి గుంటూరుకు ప్రతి అరగంటకు సర్వీసు నడుపుతున్నామన్నారు. దుర్గా విలాస్ సెంటర్ నుంచి గుంటూరుకు ప్రతి 15 నిముషాలకు ఓ సర్వీసు నడుపుతున్నామని, మొత్తం 18 సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa